పార్కింగ్ లాట్స్గా శాండీ ఏరియాస్
- July 14, 2016
షార్జా సిటీలో కొత్తగా 350 పెయిడ్ ప్రైవేట్ పార్కింగ్ లాట్స్ అందుబాటులోకి రానున్నాయి. షార్జా టౌన్ ప్లానింగ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఛైర్మన్, ఇంజనీర్ సలా బిన్ బుట్టి మాట్లాడుతూ, 350 ప్రైవేట్ పార్కింగ్ లాట్స్ కోసం పెట్టుబడిదారులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. వీటిల్లో 10 శాతం ప్రభుత్వ స్థలాలనీ ఆయన చెప్పారు. రెసిడెంట్స్‌కి మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారాయన. పార్కింగ్ రెంటల్స్ని గంటకు 5 నుంచి 10 దిర్హామ్లుగానూ, నెలవారీ ఛార్జీలను 300 నుంచి 600 దిర్హామ్లుగానూ నిర్ణయించినట్లు బిన్ బుట్టి చెప్పారు. ప్రైవేట్ పార్కింగ్ లాట్స్పై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామనీ, సరౌన సౌకర్యాలను రెసిడెంట్స్‌కి కల్పించడంతోపాటుగా వివిధ అంశాలపై ఈ తనిఖీలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఇప్పటిదాకా శాండీ ఏరియాస్‌లో ఉచితంగా తమ వాహనాల్ని పార్కింగ్ చేసుకునేవారికి, ఇకపై పార్కింగ్ పీజులు అదనపు బర్డెన్‌గా మారనున్నాయి. వినియోగదారుల నుంచి ప్రైవేట్ లాట్స్ పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్కింగ్ ఫీజుల్ని కాస్తయినా తగ్గించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







