'ఫాల్కన్ ఐ' సిస్టమ్‌ని ప్రారంభించిన అబుదాబీ
- July 14, 2016
అబుదాబీ మానిటరింగ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఎడిఎంసిసి), ఫాల్కన్ ఐ సిస్టమ్‌ని క్యాపిటల్ సిటీ, ఎయిర్‌పోర్ట్, మెయిన్ ఐలాండ్స్ మరియు బనియాస్, ముసాఫా ప్రాంతాల్ని కవర్ చేసేట్లుగా వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఫాల్కన్ ఐ సిస్టమ్ ద్వారా, ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సర్వైలెన్స్ ఎక్విప్‌మెంట్ నుంచి లైవ్ స్ట్రీమింగ్‌ని పొందే అవకాశం ఉంది. అబదాబీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వేలాది కెమెరాలను ఈ సిస్టమ్ లింకప్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌ఫేస్ ద్వారా వీటిని విశ్లేషించి, ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిస్థితుల్ని పరిశీలించి, తదనుగుణంగా సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేస్తుంది. నిబంధనల ఉల్లంఘనను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది ఈ సిస్టమ్. బహిరంగ ప్రదేశాల్ని పాడు చేయడం, ఎక్కువమంది ఒకే చోట గుమికూడి ఉండడం, అతి వేగంతో రోడ్లపై ప్రయాణించడం, అలాగే యాక్సిడెంట్లు జరగడాన్ని గుర్తిస్తుంది ఫాల్కన్ సిస్టమ్. ఈ కొత్త సిస్టమ్ ద్వారా భద్రత విషయంలో అధికారులు ఇంకా సమర్థవంతంగా వ్యవహరించడానికి వీలు కలుగుతుందని అబుదాబీ పోలీస్ కమాండర్ ఇన్ ఛీఫ్ మరియు ఎడిఎంసిసి బోర్డ్ ఛైర్మన్ మేజర్ జనరల్ మొహమ్మద్ ఖల్ఫాన్ అల్ రొమైతి చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







