సెప్టెంబర్‌లో మాన్‌సూన్ ఫెస్టివల్
- July 14, 2016
కేరళ నుంచి మాన్‌సూన్ ఫెస్టివల్‌ని నిర్వహించేందుకు సెప్టెంబర్ నెల వేదిక కానుంది. 2005లో కేరళలో ప్రారంభమైన మాన్‌సూన్ సినీ ఫెస్టివల్ ఇప్పుడు దుబాయ్, అబుదాబీ మరియు షార్జాలకు విస్తరించింది. పాన్ అరబ్ టూర్‌లో భాగంగా కేరళ ప్రభుత్వ సహకారంతో ఈ ఫెస్టివల్స్‌ని నిర్వహిస్తున్నారు. గల్ఫ్ రీజియన్ కోసం తొలిసారిగా మాన్‌సూన్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. 'కోచి మెట్రో షార్ట్ ఫిలింస్ యూఏఈ' పేరుతో నిర్వహించనున్న ఈ ఈవెంట్‌లో 50 షార్ట్ ఫలింస్‌ని ప్రదర్శిస్తారు. సినిమా ద్వారా సమాజానికి సంబంధించి అనేక ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించి, ప్రజల్ని జాగృతం చేసే అవకాశముందని ఫెస్టివల్ డైరెక్టర్ రవీందర్ చెప్పారు. యూఏఈని బేస్ చేసుకుని రవీందర్ ఓ వాట్సాప్ గ్రూప్‌ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా షార్ట్ ఫిలింస్‌నీ, మూవీ మేకింగ్ కాన్సెప్ట్‌లనీ షేర్ చేస్తున్నారు. మాన్‌సూన్ సినీ ఫెస్టివల్‌లో అరేబియన్ ఫ్రేమ్స్ అనే షార్ట్ పిలిం ఫెస్టివల్ ప్రత్యేకంగా దుబాయ్, అబుదాబీకి చెందినవారి కోసం కేరళలోని కోచి, కోజికోడ్, తిరువనంతపురంలోనూ నిర్వహించనున్నట్లు తెలిపారాయన. గల్ఫ్ రీజియన్, కేరళీయులకు రెండో స్వస్థలంగా వర్ధిల్లుతోందనీ, అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రవీంద్రన్.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







