తిరుపతిలోని శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- June 29, 2025
తిరుపతి: తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీ శక్తిపీఠం శ్రీ పాతాళ శ్వేత వారాహీ క్షేత్రంలో శ్రీ వారాహీ నవరాత్రులు సందర్భముగా శ్రీ శ్రీ శ్రీ అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆదివారం దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్దేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ శక్తి పీఠాదేశ్వరీ మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా ఛైర్మన్ కలుసుకున్నారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించి స్వామి వారు, మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ శక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని చెప్పారు.
ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని ఛైర్మన్ చెప్పారు.
ప్రస్తుతం టిటిడి చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీ శక్తి పీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు.
ముందుగా టిటిడి ఛైర్మన్ శ్రీ శక్తి పీఠం చేరుకోగానే నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం టిటిడి ఛైర్మన్ ను సత్కరించి వైదేహి మాలను సమర్పించారు.శ్రీ శక్తి పీఠం తరుపున పుస్తక ప్రసాదాన్ని ఛైర్మన్ కు అందించారు.అనంతరం స్వామి, అమ్మవారిని టిటిడి ఛైర్మన్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా