రికార్డు సృష్టించిన రోనాల్డో

- October 15, 2025 , by Maagulf
రికార్డు సృష్టించిన రోనాల్డో

ఫేమ‌స్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రోనాల్డో మరోసారి ప్రపంచ క్రీడా చరిత్రలో తన పేరును లిఖించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 క్వాలిఫికేషన్లలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయ‌ర్‌గా రోనాల్డో నిలిచాడు. పోర్చుగ‌ల్ తరపున ఆడుతూ, ఇప్ప‌టి వరకు వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫికేషన్లలో 41 గోల్స్ సాధించడం ద్వారా అతను సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఈ ఘనత రోనాల్డోకు లిస్బ‌న్‌ లోని ఇస్టాడియో జోష్ అల్వలేడ్ స్టేడియంలో హంగేరీతో జరిగిన మ్యాచ్‌లో దక్కింది. వాస్తవానికి ఈ మ్యాచ్ 2-2 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. కానీ రోనాల్డో తన అత్యంత ప్రాముఖ్యత గల ఫుట్‌బాల్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడం ద్వారా తన రికార్డును మరింత మెరుగుపరచాడు.

వ‌ర‌ల్డ్‌క‌ప్ క్వాలిఫ‌యింగ్ మ్యాచ్‌ ల చ‌రిత్ర‌లో గ‌త రికార్డు గ్వాటెమాలా ప్లేయ‌ర్ కార్లో రూయిజ్ పేరిట ఉన్న‌ది. అత‌ను త‌మ దేశం త‌ర‌పున క్వాలిఫ‌యింగ్ మ్యాచుల్లో 39 గోల్స్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు రోనాల్డో.

వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌యింగ్ మ్యాచుల్లో 40 గోల్స్ మైలురాయి దాటిని తొలి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా రోనాల్డో చ‌రిత్ర సృష్టించాడు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పోర్చుగ‌ల్ జ‌ట్టు వ‌చ్చే ఏడాది జ‌రిగే ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు అర్హ‌త సాధించ‌లేదు. న‌వంబ‌ర్ 14వ తేదీన ఐర్లాండ్‌ తో జ‌రిగే మ్యాచ్‌లో గెలిస్తే, రోనాల్డో జ‌ట్టు వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు క్వాలిఫై అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com