సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- October 15, 2025
కువైట్: కువైట్ రాజధాని గవర్నరేట్‌లోని ఒక ప్రాంతంలో ఒక మహిళ కారు తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించే తప్పుదారి పట్టించే వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహనం డ్రైవర్‌ను విచారంచగా ఈ సంఘటన నిజంగానే జరిగిందని, కానీ ఆ మహిళ ఎవరో తెలియదని నిర్ధారించాడు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత, ఆ మహిళ వాహనం తెలిసిన వారిదని భావించి పొరపాటున లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించిందని వెల్లడైంది. తరువాత వచ్చిన ఓ వ్యక్తి ఆమెను ఆ ప్రదేశం నుండి తీసుకెళ్లినట్టు గుర్తించారు.
వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి తప్పుదారి పట్టించే సమాచారంతో అలా చేశాడని, సంఘటన నుంచి వ్యక్తిగత లాభం పొందడానికి మరియు సోషల్ మీడియా వీక్షణలను పెంచుకోవడానికి ఆ వ్యక్తి క్లిప్‌ను ఫోస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిందితుడిని అరెస్టు చేశారు.
ఏదైనా అనుమానాస్పద లింకులు, ప్రకటనలను గుర్తిస్తే సంబంధిత అధికారులకు నేరుగా నివేదించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు దాని ప్రామాణికతను ధృవీకరించుకోవాని కోరింది. కాగా, ధృవీకరించని లేదా తప్పుడు కంటెంట్‌ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం చట్ట ప్రకారం నేరమని హెచ్చరించింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







