విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా

- October 15, 2025 , by Maagulf
విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా

అమెరికా: ఇటీవల, అమెరికా న్యాయ శాఖ (DOJ) అత్యంత పెద్ద పరిమాణంలో బిట్‌కాయిన్‌ను సీజ్ చేసింది. ఈ సీజ్ రూ.127,271 BTC — సుమారుగా 15 బిలియన్ డాలర్లు విలువైనది. సుమారు 14 బిలియ‌న్ల డాల‌ర్ల విలువైన బిట్‌కాయిన్‌ ను అమెరికా ప్ర‌భుత్వం సీజ్ చేసింది. ఈ కేసులో కంబోడియాకు చెందిన ప్రిన్స్ గ్రూపు వ్యాపార‌వేత్తపై అభియోగాలు న‌మోదు చేశారు. క్రిప్టోక‌రెన్సీ స్కామ్‌కు సూత్ర‌ధారిగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు అమెరికా ఆరోపించింది. యూకే, కంబోడియా జాతీయుడు చెన్ జీపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు మోపారు. బిట్‌కాయిన్ బిజినెస్ ద్వారా మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వాస్త‌వానికి అమెరికా, బ్రిట‌న్ దేశాలు చెన్‌కు వ్యాపార అనుమ‌తులు ఇచ్చింది. కానీ అత‌నికి చెందిన ఆస్తుల‌ను సీజ్ చేసిన‌ట్లు యూకే ప్ర‌భుత్వం చెప్పింది. లండ‌న్‌లో ఉన్న 19 ప్రాప‌ర్టీల‌ను సీజ్ చేసింది. వాటి విలువ సుమారు 133 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంది. క్రిప్టో చ‌రిత్ర‌లో ఇదో పెద్ద ఆర్థిక నేర‌మ‌ని అమెరికా ప్రాసిక్యూట‌ర్లు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో బిట్‌కాయిన్‌ ను సీజ్ చేయ‌డం ఇదే మొద‌టిసారి అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం చెన్ ప‌రారీలో ఉన్నారు. అయితే సైబ‌ర్ ఫ్రాడ్ క్రైంలో సూత్ర‌ధారి అయిన అత‌నిపై అమెరికా నిఘా పెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com