యూఏఈలో ఘనంగా బోనాల పండుగ
- June 30, 2025
అజ్మాన్: తేది 29-06-2024, ఆదివారం నాడు ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం(ETCA)ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికతకు, భక్తి భావనకు ప్రతీక అయిన తెలంగాణ బోనాల పండుగను మైత్రి ఫార్మ్స్, అజ్మాన్ లో భక్తి శ్రద్దల నడుమ ఉత్సాహభరితంగా నిర్వహించబడింది.ఇది ETCA ఆధ్వర్యంలో మూడవ బోనాల వేడుకగా జరగడం విశేషం.
ఈ పండుగ కార్యక్రమం గౌరమ్మ పూజతో ప్రారంభమై, అనంతరం అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా నిర్వహించబడింది. సంప్రదాయబద్ధంగా దీపప్రజ్వలన చేసి, నివేద్యాలు సమర్పించారు. పట్టు చీరల్లో సాంప్రదాయ వేషధారణలో బోనాలు మోస్తూ మహిళలు ఊరేగింపు లో పాల్గొన్న దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి.
మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించడంతోపాటు, ఒడి బియ్యం సమర్పణ, అమ్మవారికి హారతి, మహిళలందరికీ వాయునం పంచడం విశిష్టంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది హాజరై తమ సాంస్కృతిక పరంపరను సామూహికంగా గౌరవించారు. మహిళలు బోనాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని, బోనాల్ని సమర్పించి కుటుంబ శ్రేయస్సు, లోకకల్యాణం కోరుతూ ప్రార్థనలు చేశారు.
ప్రధాన ఆకర్షణలు:
- అమ్మ వారి మండపం , అలంకరణ భక్తి పారవశ్యంలో మునిగేలా చేసాయి
- మహిళలు బోనాల ఎత్తుకొని సామూహికంగా కుటుంబాలతో నిర్వహించిన ఊరేగింపు అందరిని ఆకట్టుకొంది
- ఒగ్గు కథా బృందం ప్రదర్శించిన వినూత్న డప్పు విన్యాసాలు, నృత్యాలు అందరిని అలరించాయి
- పోతరాజుల వేషధారణలు మరియు ప్రదర్శనలు కార్యక్రమానికి మరింత ఉత్తేజాన్ని నింపాయి
- చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
- సాంప్రదాయ వంటలతో హాజరయిన వారి కోసం నిర్వాహకులు ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలు తెలంగాణ ఊరు లో జరిగిన వాతావరణాన్ని గుర్తు చేసాయి
సంఘటకుల కృషి ప్రశంసనీయం:
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను హాజరైన కుటుంబాలు హృదయపూర్వకంగా అభినందించాయి. తమ పిల్లలకు సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను తెలియజేయడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు: కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షులు: జగదీశ్ రావు చీటీ, ఉపాధ్యక్షులు: శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి: రాణి కొట్ల, సంయుక్త కార్యదర్శి: శేఖర్ గౌడ్ గుండవేని
కోశాధికారి : తిరుమల్ రావు బీరెల్లి
మాజీ అధ్యక్షులు: మామిడి శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాధారపు, సీనియర్ సభ్యులు వెంకటేశ్వర్ రావు , ఆనంద్ శంకర్, సాయి చందర్, ఎస్.పి కస్తూరి, సురేష్ రెడ్డి, రాజ శేఖర్ తోట
కార్యవర్గ సభ్యులు: వినోద్ ఆచార్యులు, రాము కందుకూరి, మమత కస్తూరి, రఘు ఎలిగేటి, సామ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ పోలంపల్లి, రమణ స్వర్గం, సారిక పీచర, అన్నపూర్ణ, మౌనిక గౌడ్, మధు కుమార్, కార్తీక్ రెడ్డి, వనజ గోగుల, అజర్ ఖాన్ , రాము జల, సరోజ అల్లూరి, మౌనిక గౌడ్ , రనీషా, స్వప్న, ప్రియ, విపుల, చంద్రలేఖ, లక్ష్మి, శ్వేత , సుమజ, రమ్య, అనూష, సంగీత, సౌందర్య, సువర్ణ తదితరులు పాలుగోన్నారు.
, 


తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







