పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు

- June 30, 2025 , by Maagulf
పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ ఈ రోజు పదవీ విరమణ పొందిన సివిల్ సన్ ఇన్స్పెక్టర్లు ఎస్. గోపాల్,జవహర్నగర్ ట్రాఫిక్ పీస్, పి.మోహన్ రెడ్డి (VRS) నేరెడ్మెట్ పీస్, సి.యాదవ రెడ్డి, చౌటుప్పల్ పీఎస్, టి.మహేందర్, ఘటకేసర్ పీఎస్, బి.వి.కే.రాజు, ఆఫీస్ సూపరెండెంట్, అంబర్ పేట ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్ నుండి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు (5)మహమ్మద్ గఫూర్, రఫీ అహమ్మద్,  కిషన్ లాల్, సుబ్బయ్య, రామాంజనేయులు, ధోబీ నస్రీన్ బేగం, శ్రీనివాస్, ASI ఉప్పల్ ట్రాఫిక్, వీర భద్రా రెడ్డి, ASI చర్లపల్లి, యాదగిరి రెడ్డి, కానిస్టేబుల్ భువనగిరి సీసీఎస్ లకు సీపీ సుధీర్ బాబు రాచకొండ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదవీ విరమణ పొందే అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం తాను ఏర్పాటు చేసిన పెన్షన్ డెస్క్ ద్వారా త్వరగా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ ఇందిరా, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రవీందర్ రెడ్డి, CAO అకౌంట్స్ సుగుణ, CAO అడ్మిన్ పుష్పరాజ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, పోలీస్ కో ఆపరేటివ్ సొసైటీ ట్రెజరర్ K బాలరాజ్, డైరెక్టర్స్ సంగి వలరాజు, టేకుల రవీందర్ రెడ్డి, బి.సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com