దుబాయ్, షార్జాలో ట్రాఫిక్ జామ్స్..90% డ్రైవర్లకు డైలీ సమస్య..!!
- July 01, 2025
దుబాయ్: దుబాయ్, షార్జాలో దాదాపు 90 శాతం మంది డ్రైవర్లు ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ ను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అంటే, 10 మందిలో 9 మంది వాహనదారులు తాము సాధారణంగా ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొంటున్నట్లు ఒక కొత్త అధ్యయనం తెలిపింది. అల్ వాత్బా నేషనల్ ఇన్సూరెన్స్ ద్వారా నిర్వహించిన రోడ్సేఫ్టీయుఏఈ అధ్యయనంలో 86 శాతం మంది దుబాయ్ (91 శాతం), షార్జా (90 శాతం) లలో ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
యూఏఈలో దాదాపు 80 శాతం మంది వాహనదారులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ట్రాఫిక్ రద్దీని చూశామని చెప్పారు. దుబాయ్ 85 శాతంతో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ముఖ్యంగా దుబాయ్, షార్జా, అబుదాబి లలో ట్రాఫిక్ గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగిందని పేర్కొంది.
worldometers.info డేటా ప్రకారం.. యూఏఈ జనాభా 2020లో 9.448 మిలియన్ల నుండి 11.345 మిలియన్లకు పెరిగింది. అదేవిధంగా, దుబాయ్ జనాభా దాదాపు 4 మిలియన్లకు చేరుకుంది. ఇది ఇప్పటివరకు అత్యధికం. ఈ కొత్త నివాసితుల కారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య పెరుగుతుందని నివేదిక తెలిపింది.
మార్చిలో యూఏఈ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) సభ్యుడు డాక్టర్ అద్నాన్ అల్ హమ్మది దుబాయ్, షార్జా లో రోజువారీ ట్రాఫిక్ సమస్యను లేవనెత్తారు. యూఏఈ నివాసితులు రోజువారీగా అనుభవించే ట్రాఫిక్ రద్దీ మానసిక ప్రభావాలపై ఆందోళనలను వ్యక్తం చేశారు.
అల్ వాత్బా ఇన్సూరెన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మురళీకృష్ణన్ రామన్ మాట్లాడుతూ.. యూఏఈలోని ప్రతి ఒక్కరు డైలీ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రోడ్సేఫ్టీయూఏఈ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్మాన్ మాట్లాడుతూ.. "ట్రాఫిక్ రద్దీ గురించి ప్రజల అభిప్రాయాన్ని, దానికి గల కారణాలను వారు ఎలా చూస్తారు. పరిస్థితిని మెరుగుపరచడానికి వారు ఏ రంగాలపై దృష్టి పెడతారో అర్థం చేసుకోవడానికి సంబంధిత అధికారులు, వాటాదారులకు ఇన్పుట్ అందించడం ఈ అధ్యయనం లక్ష్యం.” అని తెలిపారు.
యూఏఈ వాహనదారులు మధ్యాహ్నం అత్యధిక ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాగా, అన్ని కార్యాలయాలు ఒకే సమయంలో ప్రారంభమవడం, అన్ని పాఠశాలలు ఒకే సమయంలో ప్రారంభమవడం, ప్రైవేట్ కార్లపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఉదయం సమయంలో కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడించారు.
పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్లను ఎదుర్కోవడానికి, యూఏఈ నివాసితులు ఇంటి నుండి పని చేయడాన్ని ప్రోత్సహించాలని, ప్రజా రవాణాను మెరుగుపరచాలని, రోడ్ నెట్వర్క్ మరియు పబ్లిక్ బస్సు సేవలను విస్తరించాలని నివేదికలో సూచించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







