పీక్ అవర్స్ లో విద్యుత్తును ఆదా చేయండి..!!

- July 01, 2025 , by Maagulf
పీక్ అవర్స్ లో విద్యుత్తును ఆదా చేయండి..!!

కువైట్: కువైట్ అత్యంత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నందున, ముఖ్యంగా పీక్ అవర్స్లో విద్యుత్తును ఆదా చేయాలని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. విద్యుత్తును ఆదా చేయడం ఉమ్మడి బాధ్యత అని , విద్యుత్ కోతలను నివారించడంలో సహాయపడుతుందని సహల్ యాప్ ద్వారా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.

ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఒకేసారి ఎక్కువ ఉపకరణాలను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. కాగా, సోమవారం విద్యుత్ లోడ్ 16,841 మెగావాట్లకు చేరుకుందని, ఇది 17,000 మెగావాట్ల పరిమితికి దగ్గరగా ఉందని పేర్కొంది. విద్యుత్ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గించడానికి,  అన్ని ప్రాంతాలకు నిరంతర సరఫరాను కొనసాగించడానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com