తాటి చెట్టుని బస్సు డీ కొట్టడంతో 12 మంది కార్మికులకు గాయాలు
- July 14, 2016
రాస్ అల్ ఖైమాహ్ :తాటి చెట్టుని బస్సు మలుపు తిరుగుతూ డీ కొట్టింది. బుధవారం ఉదయం 12 మంది ఆసియా దేశాలకు చెందిన కార్మికులకు ఈ ఘటనలో ఒక మోస్తరు,తీవ్రమైన గాయాలపాలయ్యారని రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు చెప్పారు.
ట్రాఫిక్, పెట్రోల్ శాఖ డైరెక్టర్ కల్నల్ ఆలీ సయీద్ అల్ ఆలకిం తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన కార్మికుల వయస్సు 30, 44 ఏళ్ల మధ్య వారు గాయపడ్డారు. వీరందరిని మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.ఉదయం 7.30 సమయంలో పోలీసు చర్యల నిర్వహణ గదికి ఈ ప్రమాదం గూర్చి ఫోన్ రావడంతో అప్రమత్తమై పారామెడిక్స్ విభాగానికి వెంటనే ప్రమాదస్ధలికి పంపారు.
పోలీసుల ప్రారంభ పరిశోధనల ప్రకారం డ్రైవర్ రహదారిపై సరిగా దృష్టి పెట్టలేదని అందుకే ఈ ప్రమాదం జరిగినట్లు నిరూపితమైంది. ఈ ప్రమాదం నివేదిక తదుపరి అవసరమైన చట్టబద్ధమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి సంబంధిత అధికారులకు వద్దకు బదిలీ చేయబడింది .డ్రైవింగ్ పట్ల జాగ్రత్త వహించి డ్రైవింగ్ పై ఏకాగ్రత కోల్పోకుండా ఉండాలని అలాగే రహదారి భద్రతా నియమాలు కట్టుబడి ఉండాలని వాహనదారులకు కల్ అల్ ఆలకిం విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







