కొత్త స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర కేబినేట్ ఆమోదం
- July 01, 2025
న్యూ ఢిల్లీ: దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అటు రీసెర్చ్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌కు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 1 లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశం. అలాగే దీర్ఘకాలిక తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది కేంద్రం.
అలాగే తమిళనాడులో పరమాకుడి-రామనాథపురం మధ్య 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. రూ.1,853 కోట్లతో 46.7 కిమీ మేర 4 వరుసలుగా రహదారి నిర్మించనుంది. అటు రామేశ్వరం కనెక్టివిటీని కూడా ఈ రహదారి మరింత పెంచనుంది.
రీసెర్చ్, ఇన్నోవేషన్‌కు భారీ కార్పస్ ఫండ్‌తో స్కీమ్
రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌తో రీసెర్చ్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడానికి వేదికగా నిలుస్తుంది. దీర్ఘకాలిక తక్కువ వడ్డీ రుణాలు లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది.
టెక్నాలజీ, స్టార్టప్, హై-ఎండ్ పరిశోధనలకు ఇది పెద్ద మద్దతుగా మారనుంది. పరమాకుడి – రామనాథపురం మధ్య 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మొత్తం రూ.1,853 కోట్లు వ్యయంతో 46.7 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు.
రామేశ్వరం కనెక్టివిటీ మెరుగుపడడంతో పాటు అభివృద్ధికి దోహదం చేస్తుంది.
తాజా వార్తలు
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







