స్వల్పంగా తగ్గిన GST వసూళ్లు
- July 01, 2025
న్యూ ఢిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్ల జోరుకు జూన్‌లో స్వల్ప బ్రేక్ పడింది. గత రెండు నెలలుగా రెండు లక్షల కోట్ల వసూళ్లు నమోదైనప్పటికీ, జూన్‌లో మాత్రం ఆ స్థాయిని చేరలేకపోయాయి.కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాల ప్రకారం, 2025 జూన్ నెలలో మొత్తం రూ.1.85 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది జూన్‌తో పోలిస్తే 6.2 శాతం అధికం. అయినప్పటికీ, మునుపటి రెండు నెలలతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గింది.గత ఏప్రిల్‌లో రూ.2.37 లక్షల కోట్లు, మేలో రూ.2.01 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఈ రెండు నెలలు జీఎస్టీ వసూళ్లలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాయి. అదే దూకుడు జూన్‌లో కొనసాగలేదు.
జీఎస్టీ అమలుకు 8 ఏళ్లు పూర్తి
జీఎస్టీ అమలు దేశవ్యాప్తంగా 2017 జులై 1న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మలుపుగా నిలిచింది. ఈ ఏడాది జూలై 1 నాటికి జీఎస్టీ విజయవంతంగా 8 ఏళ్లు పూర్తయింది.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక సమాచారం విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11.37 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు, 2024-25 నాటికి రూ.20.08 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. అంటే గత ఐదేళ్లలో వసూళ్లు దాదాపు రెట్టింపు అయ్యాయి.కేంద్రం ప్రకారం, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలు, బిలింగ్ కట్టుబాట్లు, ఈ-ఇన్వాయిసింగ్ విధానం వల్లే వసూళ్లు పెరిగాయని చెబుతోంది. వినియోగంలో పెరుగుదల, పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం కూడా వృద్ధికి తోడ్పడింది.
ముందు నెలలతో పోలిస్తే మాత్రం స్వల్ప తగ్గుదల
జూన్ నెల వసూళ్లు తక్కువగా నమోదు కావడం వెనుక, కొన్ని రాష్ట్రాల్లో ఆర్థిక క్రియాశీలత తగ్గడం కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినా, జీఎస్టీ వ్యవస్థ స్థిరంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం.జీఎస్టీ వసూళ్లు గతంతో పోలిస్తే పెరిగినా, మునుపటి నెలల రికార్డుల్ని జూన్ అందుకోలేకపోయింది. జూలై నుంచి వసూళ్లు మళ్లీ పెరుగుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







