తెలంగాణ: ఇక పై బస్టాండ్లలో కూడా ఫ్రీ వైఫై
- July 02, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తన సేవల స్థాయిని మరింతగా అభివృద్ధి చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి దూసుకెళ్తోంది. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం, బస్సుల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడం, బస్టాండ్లలో వేచి ఉండే సమయాన్ని ఉపయోగకరంగా మార్చడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని, ఆర్టీసీ తాజాగా వైఫై సదుపాయం అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.ఇప్పటికే ఒక ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థతో చర్చలు జరిపింది.ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్టీసీ అధికారులు ఈ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌తో సంతృప్తి చెందిన మంత్రి పొన్నం, వైఫై సౌకర్యం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది
దీంతో ఆర్టీసీ యాజమాన్యం తమ ఈ వినూత్న ప్రణాళికను వేగవంతం చేయడానికి చర్యలను ముమ్మరం చేసింది.మొదటి దశలో అన్ని రకాల బస్సులు, బస్ స్టేషన్లలో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ముందుగా ఎంపిక చేసిన సినిమాలు, పాటలను చూడగలుగుతారు. తదుపరి దశలో సాధారణ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా అందించే యోచన ఉంది. అయితే ఈ సినిమాలు, పాటలను వీక్షించే సమయంలో మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి.ఈ అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా సంస్థకు భారీ ఆదాయం సమకూరనుందని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది.ఈ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం ఇంటర్నెట్ సంస్థకు, ఆర్టీసీ యాజమాన్యానికి చెరి సగం చొప్పున లభిస్తుంది.
ప్రజా రవాణా వ్యవస్థ వైపు ఆకర్షించడం
దీనివల్ల ఆర్టీసీ ప్రయాణికులకు వినోదాన్ని పంచుతూనే, సంస్థకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతుంది. ప్రయాణికులు నిరీక్షణ సమయాన్ని లేదా ప్రయాణ కాలాన్ని ఆనందంగా గడపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ఎక్కువ మంది ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ వైపు ఆకర్షించడం, తద్వారా సంస్థ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడం టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ప్రయాణికులు తమ బస్సును కోసం వేచివుంటూ కూడా ఇంటర్నెట్ ద్వారా తమ పనులను నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు తమ డేటా ఖర్చు లేకుండా వర్క్ చేయగలుగుతారు. అలాగే టూరిస్టులకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







