జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
- July 03, 2025
న్యూ ఢిల్లీ: దేశం మొత్తం వేచి చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ తేదీలకు ఆమోదం తెలపగా, ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు.
సమావేశాల పొడిగింపు
ఈ సమావేశాలు మొత్తం 26 రోజులు జరగనున్నాయి.అయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సభలు ఉండవు. ముందుగా ఈ సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు పొడిగించారు. ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. అందులో అణుశక్తి రంగంలో ప్రైవేటు సెక్టర్ ప్రవేశాన్ని అనుమతించే చట్టాలు ఉన్నాయి. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, అటామిక్ ఎనర్జీ చట్టంలో సవరణలు చేయాలని అనుకుంటోంది.కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రకటనను అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లు తెలుస్తోంది.
విపక్షాల డిమాండ్లు–భద్రతా, రాష్ట్రీయ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి
ఈ వర్షాకాల సమావేశాల్లో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యపై స్పష్టత ఇవ్వాలని కోరాయి. ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా తెలపాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలోనే వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది.
గత సమావేశాల గుర్తు–వక్ఫ్ బిల్లు, విశ్వవిద్యాలయ చట్టం
ఇక గత బడ్జెట్ అయితే 2025లో జనవరి 31వ తేదీ- ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. అప్పుడే ఉభయసభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమెదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో బిల్లుగా మారింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమావేశాల్లో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025 కూడా ఆమెదం పొందింది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







