బహ్రెయిన్ లో సోషల్ మీడియా యూజర్ కు జైలుశిక్ష..!!

- July 03, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో సోషల్ మీడియా యూజర్ కు జైలుశిక్ష..!!

మనామా: వేలాది మంది ఫాలోవర్లు ఉన్న ఓ సోషల్ మీడియా యూజర్.. స్త్రీ వేషధారణలో అసభ్యకరమైన క్లిప్‌లను షేర్ చేశాడని ప్రాసిక్యూటర్లు ఆరోపించిన తర్వాత కోర్టు అతనికి జైలుశిక్ష విధించింది.బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..అతడు అరబ్ జాతీయుడని, అతని పేరు బహిరంగంగా ప్రకటించబడలేదు.మహిళల దుస్తులలో హావభావాలు ప్రదర్శిస్తూ తీసిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. 

ఆన్ లైన్ లో షేర్ అయిన కంటెంట్ హద్దులు దాటిందని, ప్రజల ప్రతిష్టతను కించపరుస్తుందని, స్థానిక సంప్రదాయాలను ఉల్లంఘిస్తుందని అధికారులు కేసు నమోదు చేశారు.  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ ఆన్‌లైన్‌లో ఆక్షేపణీయ పోస్ట్‌లను గుర్తించి, ప్రాసిక్యూటర్లను అప్రమత్తం చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com