న్యూజిలాండ్‌ పై టీమిండియా ఘన విజయం

- January 21, 2026 , by Maagulf
న్యూజిలాండ్‌ పై టీమిండియా ఘన విజయం

భారత్‌, న్యూజిలాండ్ మధ్య నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 84, ఇషాన్ కిషన్ 8, సూర్యకుమార్ యాదవ్ 32, హార్దిక్ పాండ్యా 25, శివమ్ దూబే 9, రింకూ సింగ్ 44 (నాటౌట్), అక్షర్ పటేల్ 5, అర్ష్‌దీప్ సింగ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు.

న్యూజిలాండ్‌ బౌలర్లలో జాకబ్ డఫీ, కైల్ జేమిసన్ రెండేసి వికెట్లు, క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ విఫలమైంది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో డెవన్ కాన్వే 0, టిమ్ రాబిన్సన్ 21, రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 78, మార్క్ చాప్మన్ 39, డారిల్ మిచెల్ 28, మిచెల్ సాంట్నర్ 20 (నాటౌట్), క్లార్క్‌ 0, కైల్‌ జేమీసన్‌ 1 (నాటౌట్) పరుగు చేశారు. దీంతో న్యూజిలాండ్‌ స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190గా నమోదైంది.

టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం దుబే రెండేసి వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com