ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- January 22, 2026
దోహా: శాంతి మండలిలో చేరాలన్న అమెరికా అధ్యక్షుడి పిలుపును ఎనిమిది అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు స్వాగతించాయి. ఖతార్ , టర్కీ , ఈజిప్ట్ , జోర్డాన్, ఇండోనేషియా , పాకిస్తాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రులు ఈ మేరకు ట్రంప్ ఆహ్వానాన్ని స్వాగతించారు. శాంతి మండలిలో చేరాలనే తమ దేశాల ఉమ్మడి నిర్ణయాన్ని మంత్రులు ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని శాంతి ప్రయత్నాలకు తమ దేశాల మద్దతును మంత్రులు పునరుద్ఘాటించారు.
గాజా సంఘర్షణను ముగించడానికి రూపొందించిన సమగ్ర ప్రణాళికలో పేర్కొన్న విధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2803 ద్వారా ఆమోదించిన శాంతి మండలి లక్ష్యానికి మద్దతు తెలిపారు. శాశ్వత కాల్పుల విరమణను పటిష్టం చేయడం, గాజా పునర్నిర్మాణానికి మద్దతు ఇవ్వడం మరియు అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా పాలస్తీనియన్ల స్వీయ-నిర్ణయాధికారం కల్పించే హక్కు సాధించే చర్యలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







