షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!

- January 22, 2026 , by Maagulf
షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!

యూఏఈ: షార్జాలో ఓ టాక్సీ ఒక రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్ నబ్బా ప్రాంతంలోని బుండూ ఖాన్ రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్ గ్లాస్ డోరును ఢీకొనడంతో టాక్సీ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది.  రాత్రి 8.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని రెస్టారెంట్ జనరల్ మేనేజర్ ఫజల్ రెహమాన్ అబ్బాసి తెలిపారు. టాక్సీ డ్రైవర్ బ్రేక్‌లకు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com