'కూలీ' నుంచి దహాగా అమీర్‌ఖాన్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
- July 03, 2025
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ రోజు మేకర్స్ అమీర్‌ఖాన్ ని దహాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ అమీర్‌ఖాన్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మ్యాసీవ్ హైప్‌ను సూచిస్తోంది.
రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ‘చికిటు’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.
కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.
ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: కళానిధి మారన్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్: ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డిఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







