రాజు చార్లెస్ III ను కలిసిన సుల్తాన్ హైతం బిన్ తారిక్..!!
- July 05, 2025
లండన్: ఒమన్ కింగ్ సుల్తాన్ హైతం బిన్ తారిక్.. ఇంగ్లాండ్లోని బెర్క్షైర్లోని విండ్సర్ కోటలో గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్కు చెందిన యునైటెడ్ కింగ్డమ్ (UK) రాజు, కామన్వెల్త్ అధిపతి చార్లెస్ III తో సమావేశమయ్యారు. కింగ్ సుల్తాన్ ప్రస్తుతం UKలో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు.
ఈ సందర్భంగా రాజు సుల్తాన్ - రాజు చార్లెస్ III రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలు, మెరుగైన భవిష్యత్ కోసం, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు.
అలాగే, ఇటీవలి ప్రపంచ పరిణామాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ ఉద్రిక్తతలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడి ఆందోళన కలిగించే అనేక అంశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







