ప్రపంచ ICT అభివృద్ధి సూచికలో అగ్రస్థానంలో సౌదీ అరేబియా..!!
- July 05, 2025
రియాద్ః 164 దేశాల డిజిటల్ పురోగతిని అంచనా వేసే 2025 అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU).. ICT అభివృద్ధి సూచికలో సౌదీ అరేబియా టాప్ ప్రపంచ ర్యాంకింగ్ను పొందింది. కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) సౌదీ అరేబియా అగ్రస్థానాన్ని ధృవీకరించింది. ICT రంగంలో స్థిరమైన వృద్ధి, నిరంతర జాతీయ ప్రయత్నాలకు ఈ ఘనత దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.
సౌదీ అరేబియా అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాలు దాని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణలో కీలక పాత్ర పోషించాయని CST హైలైట్ చేసింది. ఇది 2024లో SR459 బిలియన్లకు చేరుకుందని, ఇది స్థూల దేశీయోత్పత్తి (GDP)కి 15% జోడించిందని తెలిపింది. 2024లో SR180 బిలియన్ల విలువైన కింగ్డమ్ ICT మార్కెట్, మిడిలీస్ట్, ఉత్తర ఆఫ్రికాలో అతిపెద్దదని, వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంది. సౌదీ అరేబియాలో 212% మొబైల్ సబ్స్క్రిప్షన్ విస్తరణ రేటును సాధించిందని, ప్రతి వినియోగదారునికి నెలవారీ డేటా వినియోగాన్ని ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా నమోదు చేసిందని ఈ సందర్భంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!







