తెలంగాణ టెట్ 2025 ఆన్సర్ కీ విడుదల
- July 06, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత నిర్ధారించేందుకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2025 జూన్ సెషన్ పరీక్షలు ఇటీవలే విజయవంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో జూన్ 18 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో 16 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి.
ఈ నేపథ్యంలో, ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది.ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టెట్ కన్వినర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ (TET) పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాజరు శాతం వివరాలు: పరీక్షల హాజరు శాతం విశ్లేషణ చూస్తే, అభ్యర్థుల్లో ఆసక్తి ఎంతో స్పష్టమవుతోంది.
పేపర్–1 (ప్రాథమిక స్థాయి):
పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 47,224 మంది అంటే 74.65 శాతం పరీక్షలకు హాజరయ్యారు.
పేపర్–2 (గణితం & సైన్స్):
అలాగే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ కు 66,686 మంది దరఖాస్తు చేసుకుంటే 48,998 మంది అంటే 73.48 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
పేపర్–2 (సోషియల్ స్టడీస్):
పేపర్ 2 సోషల్ స్టడీస్ పేపర్‌కు 53,706 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 41,207 మంది అంటే 76.73 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది కీ రూపొందించి, ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో (https://tstet.cgg.gov.in) చెక్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీ పై అభ్యంతరాల గడువు
ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలను జులై 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ పంపించడానికి అవకాశం ఉంటుందని టెట్ కన్వినర్ నవీన్ నికోలస్ సూచించారు. ఫైనల్ కీ ఆధారంగా ఫలితాల ప్రక్రియ పూర్తిచేయబడుతుంది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..