కళారాజ్ సోషల్ మీడియా మరియు సినిమా అవార్డ్స్–2025

- July 06, 2025 , by Maagulf
కళారాజ్ సోషల్ మీడియా మరియు సినిమా అవార్డ్స్–2025

హైదరాబాద్: సోషల్ మీడియా మరియు సినీ ప్రపంచాన్ని గౌరవించే ఉద్దేశంతో కళారాజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా సోషల్ మీడియా & సినిమా అవార్డ్స్–2025 వేడుక హైదరాబాద్ లో ఈ నెల20న T-Hub లో నిర్వహించబడుతోందని కళారాజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మర్రి తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవ్వనున్నారు.

ఈ అవార్డ్స్ ప్రధానంగా రెండు విభాగాల్లో బడతాయి—సినిమా విభాగం,సోషల్ మీడియా విభాగం

సినిమా విభాగం:
ఈ విభాగంలో ఉత్తమ నటుడు, ఉత్తమ నట్రి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నేపథ్య సంగీతం వంటి అనేక విభాగాల్లో అవార్డులు ప్రకటించబడతాయి. వినూత్నమైన కథలు, కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహంగా ఈ అవార్డులు నిలుస్తాయి.

సోషల్ మీడియా విభాగం:
ఈ విభాగం సోషల్ మీడియా వేదికల్లో ప్రభావాన్ని చూపిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు గౌరవంగా నిలుస్తాయి.యువతలో స్పూర్తిగా నిలుస్తున్న టాలెంట్‌ను గుర్తించి అవార్డులతో సత్కరించడం కళారాజ్ సంస్థ ప్రధాన లక్ష్యం.

ముఖ్య అతిధులు:
ఈ వేడుకకు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా స్టార్‌లు, మరియు వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరవ్వనున్నారు.

కళారాజ్ సంస్థ దృష్టికోణం:
కళ, సాంకేతికత మరియు సామాజిక ప్రభావానికి వేదికగా నిలవడం–ఇదే కళారాజ్ లక్ష్యం. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో ప్రతిభను గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ అవార్డ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఈ వేడుకతో కళారాజ్ మరింత మంది టాలెంట్లకు ప్రేరణగా నిలుస్తూ, సినీ మరియు డిజిటల్ ప్రపంచానికి మధుర జ్ఞాపకాల్ని అందిస్తుంది.ఈ వేడుకకు మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com