2030 నాటికి 25 శాతం డ్రైవర్‌లెస్ ట్రిప్పులు..!!
- July 06, 2025
దుబాయ్: దుబాయ్ లో ఈ సంవత్సరం చివర్లో డ్రైవర్‌లెస్ వాహనాల పైలట్ ట్రయల్స్‌ను ప్రారంభించనున్నారు. 2026లో పూర్తిగా డ్రైవర్‌లెస్ వాణిజ్య సేవను ప్రారంభించే దిశగా ఈ చొరవ ఒక ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. ఈ మేరకు రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ఆటోమెటివ్ డ్రైవింగ్ టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి అయిన Pony.aiతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. విభిన్న రహదారి, వాతావరణ పరిస్థితులలో సురక్షితమైన, ఖచ్చితమైన నావిగేషన్‌ను నిర్ధారించడానికి అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలతోపాటు లిడార్లు, రాడార్లు, కెమెరాలతో కూడిన బలమైన సెన్సార్ సూట్‌ను ఇందులో భాగంగా పరిక్షించనున్నారు.
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) డైరెక్టర్ జనరల్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. దుబాయ్ స్మార్ట్ సెల్ఫ్-డ్రైవింగ్ ట్రాన్స్‌పోర్ట్ స్ట్రాటజీని సాకారం చేసుకునే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. 2030 నాటికి దుబాయ్‌లోని అన్ని ప్రయాణాలలో 25 శాతం ప్రయాణాలను వివిధ రవాణా మార్గాలలో ఆటోమెటివ్ ప్రయాణాలుగా మార్చడం ఈ వ్యూహం లక్ష్యమని తెలిపారు.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..