సౌదీ అరేబియాలో 8,051 మందిపై బహిష్కరణ వేటు..!!
- July 06, 2025
రియాద్: సౌదీ అరేబియా జూన్ 26 - జూలై 2 మధ్య మొత్తం 17,863 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టు చేసిన వారిలో 10,746 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారు, 4,362 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు, 2,755 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారు. అలాగే, సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తు అరెస్టయిన మొత్తం వ్యక్తుల సంఖ్య 1,507 అని, వీరిలో 33 శాతం యెమెన్ జాతీయులు, 65 శాతం ఇథియోపియన్ జాతీయులు, రెండు శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు.
11,874 మంది పురుషులు, 1,488 మంది మహిళలు సహా మొత్తం 13,362 మంది అక్రమ నివాసితులపై వివిధ దశలలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి వారికి ఆశ్రయం లేదా ఏదైనా ఇతర సహాయం లేదా సేవను అందించే ఏ వ్యక్తికైనా 15 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు SR1 మిలియన్ వరకు జరిమానా విధిస్తారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు .. మిగిలిన ప్రాంతాలలో 999 , 996 నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘన కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్‌లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'