పుస్తకాలను ప్రసాదంగా ఇచ్చే టీటీడీ యోచన

- July 08, 2025 , by Maagulf
పుస్తకాలను ప్రసాదంగా ఇచ్చే టీటీడీ యోచన

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులకు ఈసారి ఒక ప్రత్యేక అనుభవం ఎదురవుతుంది.దర్శనం ముగిసిన అనంతరం టీటీడీ (TTD) వారు భక్తుల చేతిలో శేష ప్రసాదంగా పుస్తకాన్ని అందించనున్నట్లు తాజా సమాచారం. ‘పుస్తక ప్రసాదం’ అనే వినూత్న కార్యక్రమాన్ని టీటీడీ అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది.తిరుమల ట్రస్టు తాము ముద్రించిన పలు ఆధ్యాత్మిక గ్రంథాలను భక్తులకు ఉచితంగా అందించాలనే ఆలోచనలో ఉంది. ఈ కార్యక్రమాన్ని హిందూ ధార్మిక ప్రచార పరిషత్‌ (HDPP) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ పుస్తకాల ముద్రణ, పంపిణీలో దాతల సహకారం తీసుకోవాలన్నది ట్రస్టు యోచన.

  • భక్తుల చేతికి స్ఫూర్తిదాయక సాహిత్యం
  • ఇందులో భాగంగా భక్తులకు అందించబోయే కొన్ని ముఖ్యమైన పుస్తకాలు:
  • కర్తవ్యం దైవమాహ్నికమ్.
  • శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.
  • శ్రీనివాసుని దివ్యకథ.
  • భజగోవిందం.
  • లలితా సహస్రనామ స్తోత్రం.
  • రథసప్తమి.
  • కళ్యాణ తేజోదీపిక.

ఈ పుస్తకాలన్నీ భక్తుల భక్తిభావాన్ని గాఢం చేసేందుకు మేలుకలిగిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ప్రారంభ దశ తిరుమలలో.. ఆపై గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ.ఈ పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని ముందుగా తిరుమలలోనే ప్రారంభించనున్నారు. తర్వాత దశలవారీగా గ్రామీణ ప్రాంతాలవైపు విస్తరించాలన్నది టీటీడీ లక్ష్యం. దీని ద్వారా హిందూ సంస్కృతి, భక్తి భావాన్ని పటిష్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మతమార్పిడులను అరికట్టే భక్తి సాధన
ఈ కార్యక్రమం ద్వారా భక్తులలో ధార్మిక చైతన్యం పెంపొందిస్తామని, హిందూ భావజాలాన్ని బలోపేతం చేస్తామని టీటీడీ భావిస్తోంది.ముఖ్యంగా మతమార్పిడులను అడ్డుకునేందుకు ఇది సాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. భక్తి, ఆధ్యాత్మికతను పదునెత్తించేందుకు టీటీడీ ఈ ప్రయత్నం ఒక గొప్ప ప్రారంభంగా మారనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com