సంక్షేమ సారథి-వైఎస్సార్
- July 08, 2025
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రజా బలంతో ప్రభావితం చేసిన అతికొద్ది మంది నేతల్లో ఒకరు వైయస్సార్ అలియాస్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఒకరు. తండ్రి కోరిక వైద్యుడిగా మారినా, ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామి అవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చి అశేషమైన ప్రజాదరణ సంపాదించారు. నేడు వైఎస్ జన్మదినం సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి క్లుప్తంగా మీకు కోసం.
ఒకప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందులలో 1949, జూలై 8న ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి, తండ్రి ప్రోద్బంతో వైద్య విద్యను పూర్తి చేసి తమ ప్రాంతంలోనే వైద్యునిగా స్థిరపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవను అందించారు.
వైయస్సార్ యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టి అనంతరం 1978 లో రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలి సారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.అనంతరం రెడ్డి కాంగ్రెస్ నుండి ఇందిరా గాంధీ ఆధ్వర్యం లోని కాంగ్రెస్ పార్టీ లో చేరి రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. నెహ్రూ - గాంధీల కుటుంబం పట్ల విధేయుడిగా ఉంటూ పార్టీ పరంగా అనేక ఉన్నత పదవులను అలంకరించారు. కేవలం 35 ఏళ్లకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (పిసిసి) అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనత సైతం వీరికే సొంతం. 2003న మండు వేసవి కాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.
4 సార్లు లోక్ సభ సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించిన వైయస్సార్ మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.ముఖ్యమంత్రిగా వైయస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో లబ్ది పొందారు. ఆయా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకున్న చరిష్మా కారణంగానే ఆయన తనయుడు జగన్ సైతం రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి కాగలిగాడు. సంక్షేమ పథకాల ద్వారా పేదల పెన్నిధిగా నిలిచిన వైయస్సార్ లాంటి నాయకుడు తెలుగు రాజకీయాల్లో మరొకరు లేకపోవడం గమనార్హం. 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







