230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- July 17, 2026
దుబాయ్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ గంటకు 230 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపిన ఓ డ్రైవర్ను దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు. స్మార్ట్ నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అతడు ఉద్దేశపూర్వకంగా వాహనం నంబర్ ప్లేట్లను తొలగించి రోడ్లపై ప్రయాణించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే దుబాయ్ పోలీసుల సాంకేతిక నిఘా వ్యవస్థల సహాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వాహనాన్ని స్వాధీనం (ఇంపౌండ్) చేసుకుని 50,000 దిర్హామ్ల జరిమానా విధించారు.
ట్రాఫిక్ భద్రతకు ముప్పు కలిగించే విధంగా అతివేగంగా వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లను తొలగించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తప్పవని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. రహదారులపై ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







