ఐపీఎల్ బ్రాండ్ విలువలో RCBకి అగ్రస్థానం
- July 08, 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తన అభివృద్ధి పరంపరను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన క్రీడా లీగులలో ఒకటిగా నిలిచింది. ఇటీవల ముగిసిన 2025 సీజన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గొప్ప ఘనతను సాధించింది. ఒకవైపు టైటిల్‌ను గెలుచుకుంటూ ఫ్యాన్స్ ఆశలను నెరవేర్చగా, మరోవైపు అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. ఇది కేవలం క్రీడా విజయం మాత్రమే కాకుండా, మార్కెట్ పరంగా ఒక నూతన అధ్యాయానికి నాంది కావడం విశేషం.
ఆర్సీబీ బ్రాండ్ విలువలో గణనీయ వృద్ధి
ప్రఖ్యాత అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలిహాన్ (International investment bank Houlihan) లోకీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆర్సీబీ (RCB) బ్రాండ్ విలువ గత ఏడాదితో పోలిస్తే 227 మిలియన్ డాలర్ల నుంచి 269 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ 242 మిలియన్ డాలర్ల విలువతో రెండో స్థానంలో ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ 235 మిలియన్ డాలర్ల విలువతో మూడో స్థానానికి పరిమితమైంది. అయితే, బ్రాండ్ విలువలో వార్షికంగా అత్యధిక వృద్ధిని పంజాబ్ కింగ్స్ (39.6%) నమోదు చేసింది.
లీగ్ స్థాయిలో ఐపీఎల్ వ్యాపార విస్తరణ
2024తో పోలిస్తే ఐపీఎల్ 12.9 శాతం వృద్ధితో 18.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.54 లక్షల కోట్లు) చేరింది. అలాగే, ఐపీఎల్ బ్రాండ్ విలువ కూడా 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఆదాయ వర్షం
బీసీసీఐ టాటా గ్రూప్‌తో టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను 2028 వరకు పొడిగించడం ద్వారా బీసీసీఐకి సుమారు రూ. 2,500 కోట్లు అందనుంది. మై11సర్కిల్, ఏంజెల్ వన్ వంటి నాలుగు అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా మరో రూ. 1,485 కోట్లు సమకూరాయి. ఇది గత సైకిల్ కంటే 25 శాతం అధికం. వీక్షణలోనూ ఐపీఎల్ కొత్త రికార్డులు సృష్టించింది.
దృశ్యప్రవాహంలోనూ తిరుగులేదు
2025 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో 67.8 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఇది దేశీయ OTT మరియు స్పోర్ట్స్ స్ట్రీమింగ్ చరిత్రలోనే అత్యధికంగా చెప్పవచ్చు.
హౌలిహాన్ లోకీ డైరెక్టర్ హర్ష్ తాలికోటి మాట్లాడుతూ- “ఐపీఎల్ క్రీడా వ్యాపారంలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ఫ్రాంచైజీల విలువలు, మీడియా హక్కులు, బ్రాండ్ భాగస్వామ్యాలు రికార్డు స్థాయికి చేరాయి అని హౌలిహాన్ లోకీ డైరెక్టర్ హర్ష్ తాలికోటి తెలిపారు.
2025 ఐపీఎల్ టాప్?
జూన్ 3న IPL 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ తొలి టైటిల్‌ను గెలుచుకోవడంతో ముగిసింది.
ఆర్సిబిలో ఎవరు బెస్ట్?
IPL 2025లో విరాట్ కోహ్లీ RCB తరపున అత్యుత్తమ ప్రదర్శనకారుడిగా నిలిచాడు, 11 ఇన్నింగ్స్‌లలో 63.12 సగటు మరియు 159.20 స్ట్రైక్ రేట్‌తో 505 పరుగులతో చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాడు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







