ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!

- July 13, 2025 , by Maagulf
ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోని పర్యాటక రంగం సందర్శకుల సంఖ్య పరంగా పెరుగుదలను నమోదు చేస్తుంది. దాంతో ఆర్థికంగా కూడా ఆదేశానికి కలిసి వస్తుంది.నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన డేటా ప్రకారం.. జాతీయ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం సహకారం 2018లో OMR 1.75 బిలియన్ల నుండి 2024 చివరి నాటికి OMR 2.12 బిలియన్లకు పెరిగింది.ఇది 3.2 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. 2018లో 2.3 బిలియన్ల OMRలతో పోలిస్తే, 2024లో ఒమన్ GDPకి పర్యాటక రంగం సహకారం OMR 2.7 బిలియన్లకు పెరిగింది.  

2024లో పర్యాటక రంగం సాధించిన సానుకూల ఫలితాలు, సందర్శకుల సంఖ్య, ఖర్చులు వంటివి సుల్తానేట్ ఆఫ్ ఒమన్ స్థానాన్ని పర్యాటక గమ్యస్థానంగా పెంచిందని పర్యాటక మంత్రి సలీం మొహమ్మద్ అల్ మహరూకి వెల్లడించారు.పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేసినట్లు తెలిపారు.  దాంతో సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో మొత్తం పర్యాటక వినియోగం 2018లో OMR 960 మిలియన్లతో పోలిస్తే 2024లో OMR 1.02 బిలియన్లకు పెరిగిందన్నారు.

ఒమన్ సుల్తానేట్ 2024లో సుమారు 3.8 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించింది.  మొత్తం పర్యాటక వ్యయం సుమారు OMR 989 మిలియన్లు, సగటు తలసరి వ్యయం OMR 253.8గా నమోదైంది. వచ్చే సందర్శకులలో 55 శాతం కంటే ఎక్కువ మంది యూఏఈ నివాసితులు అని డేటా తెలిపింది.  యూరోపియన్ సందర్శకులు 16 శాతం, ఆసియా దేశాల నుండి వచ్చిన సందర్శకులు 13.2 శాతం ఉన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com