క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా

- July 13, 2025 , by Maagulf
క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా

రియాద్: క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) వెల్లడించింది. నిషేధించిన  వస్తువుల నుండి సమాజాన్ని రక్షించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. జాతీయ భద్రతను కాపాడటానికి నిరంతర పహారా కొనసాగుతుందని తెలిపింది. ఈ క్రమంలో భూమి, సముద్రం, వాయు నౌకాశ్రయాలలో 1,268 అక్రమ రవాణా ప్రయత్నాలను అడ్డుకున్నట్లు వెల్లడించింది. సీజ్ వస్తువులలో హషీష్, కొకైన్, హెరాయిన్, క్రిస్టల్ మెత, కాప్టాగన్ మాత్రలు వంటి 116 రకాల మాదకద్రవ్యాలు, 683 ఇతర నిషేధిత పదార్థాలతోపాటు 2,114 పొగాకు ఉత్పత్తులు, 61 రకాల అప్రకటిత కరెన్సీ ఉన్నాయని తెలిపారు.   

ఏదైనా సమాచారాన్ని భద్రతా హాట్‌లైన్ (1910), ఇమెయిల్ ([email protected]) లేదా అంతర్జాతీయ నంబర్ (+9661910) ద్వారా నివేదించాలని పిలుపునిచ్చారు. జాతీయ స్మగ్లింగ్ నిరోధక ప్రయత్నాలను అడ్డుకునేందుకు మద్దతు ఇవ్వాలని అథారిటీ ప్రజలను కోరింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com