దుబాయ్ లో మోస్ట్ వాంటెడ్ ముగ్గురు బెల్జియన్ల అరెస్టు..!!
- July 14, 2025
దుబాయ్ః ఎన్నో ఏండ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు బెల్జియన్లను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో యూరప్‌లోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒత్మాన్ ఎల్ బల్లౌటి కూడా ఉన్నాడు. దుబాయ్ పోలీసులు వారిని బెల్జియంకు అప్పగించారు.
'కొకైన్ కింగ్'గా పేరు పొందిన 38 ఏళ్ల బెల్జియన్-మొరాకో ఒత్మాన్ ఎల్ బల్లౌటి ని, అంతర్జాతీయ నిఘా సంస్థల సమన్వయంతో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరస్థులు మాథియాస్ అక్యాజిలి, జార్జి ఫేస్‌లను కూడా బెల్జియంకు అప్పగించినట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకటించింది. వీరి ముగ్గురిపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు ఉన్నాయని తెలిపింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, సాయుధ దోపిడీ, అంతర్జాతీయ నేర సంస్థను నడపడం వంటి తీవ్రమైన ఆరోపణలను నిందితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
2021లో బెల్జియం -యూఏఈ మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నిందితులను బెల్జియంకు అప్పగించినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







