ఒమన్ లో 300శాతం పెరిగిన నీటమునిగిన కేసులు..!!

- July 14, 2025 , by Maagulf
ఒమన్ లో 300శాతం పెరిగిన నీటమునిగిన కేసులు..!!

మస్కట్: ఒమన్లో ప్రమాదవశాత్తు నీటమునిగే ప్రమాదాలు గత సంవత్సరంతో పోలిస్తే 2024లో 300 శాతం పెరిగాయి. ఇది వేసవి నెలల్లో భారీగా పెరుగుతున్నట్లు వెల్లడించారు.  ఈమేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) విడుదల చేసిన డేటా ఆందోళన వ్యక్తం చేసింది. నీటమునిగిపోవడం వల్ల సంభవించే సంఘటనలు 2024లో 639 కేసులకు పెరిగాయి. ఇది 2023లో 166 కేసులుగా ఉంది. ఒక సంవత్సరంలో 473 ప్రమాదాలు పెరిగడంపై నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో సుల్తానేట్లో 324 ప్రమాదాలు నమోదవ్వగా, 2021లో ఒమన్లో 521, 2020లో 361 కేసుల చొప్పున నమోదైనట్లు పేర్కొన్నారు.  
చాలా మంది నివాసితులు,  సందర్శకులు సమ్మర్ లో వేడి నుండి ఉపశమనం పొందేందుకు వాడిలు, బీచ్లు, ఇతర సహజ నీటి వనరులలో ఈతకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దీంతో భద్రతాపరమైన పర్యవేక్షణ లేక ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో, ప్రజలు వెంటనే అత్యవసర నంబర్ 9999 లేదా 24343666లో CDAA ఆపరేషన్స్ సెంటర్ను సంప్రదించాలని కోరారు.
మరోవైపు నీటమునిగే విషాదాలను నివారించడానికి అప్రమత్తత చాలా కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లలను స్వయంగా పర్యవేక్షించాలని, పెద్ద పిల్లలకు వారి భద్రతను అప్పగించకూడదని, కొన్ని నిమిషాలు కూడా పిల్లలను నీటి దగ్గర గమనించకుండా ఉంచకూడదని నాటిలస్ స్విమ్మింగ్ క్లబ్ అసోసియేట్ హెడ్ కోచ్, ఒలింపిక్ కోచ్ డానియల్ తులుపోవ్ సూచించారు. పిల్లల కోసం తేలియాడే పరికరాలను మాత్రమే కాకుండా ఆర్మ్బ్యాండ్లను కూడా ఉపయోగించడం చాలా అవసరం అని అన్నారు. నీటిలో ఉన్నప్పుడు వేడి దెబ్బను నివారించడానికి తగినంత హైడ్రేషన్ను నిర్ధారించడం చాలా ముఖ్యమని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com