లండన్‌లో ఘోర విమాన ప్రమాదం
- July 14, 2025
లండన్: లండన్‌లో లండన్ సౌథెండ్ ఎయిర్‌పోర్టు వద్ద చిన్న విమానం కుప్పకూలింది.ఈ ప్రమాదం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే జరిగింది.ప్రమాదానికి గురైన విమానం బీచ్‌క్రాఫ్ట్ బీ200 సూపర్ కింగ్ ఎయిర్ అనే చిన్న ప్రయాణికుల విమానం. ఇది డచ్ కంపెనీ జ్యూస్ ఏవియేషన్ ద్వారా నడపబడుతోంది. సాధారణంగా వైద్య రవాణా మరియు ఇతర సేవలకు ఈ రకం విమానాలను ఉపయోగిస్తారు. ఈ విమానం లండన్ సౌథెండ్ ఎయిర్‌పోర్టు నుండి నెదర్లాండ్స్‌లోని లెలీస్టాడ్ నగరానికి బయలుదేరింది.టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం అదుపు తప్పి, ఎయిర్‌పోర్టు పరిధిలోనే కూలిపోయింది.కుప్పకూలిన వెంటనే భారీ పేలుడు సంభవించి, పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు లేదా సిబ్బంది ఉన్నారు, వారి పరిస్థితి ఏమిటి అనే దానిపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే కొన్ని నివేదికలు తొమ్మిది మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రాణనష్టంపై పూర్తి స్పష్టత ఇంకా రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే సౌథెండ్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అగ్నిమాపక దళాలు, అత్యవసర వైద్య బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని గోల్ఫ్ క్లబ్, రగ్బీ క్లబ్‌లను కూడా భద్రతా చర్యల్లో భాగంగా ఖాళీ చేయించారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం