బహ్రెయిన్ రోడ్డు భద్రతను పెంచిన సివిల్ ట్రాఫిక్ పెట్రోల్స్‌..!!

- July 15, 2025 , by Maagulf
బహ్రెయిన్ రోడ్డు భద్రతను పెంచిన సివిల్ ట్రాఫిక్ పెట్రోల్స్‌..!!

మనామా: సివిల్ పెట్రోల్ వాహనాలను ఉపయోగించి కొత్త ఫీల్డ్ ప్రచారాలను ప్రారంభించినట్టు జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఈ వాహనాలు ప్రమాదకరమైన డ్రైవింగ్ అలవాట్లను నిశ్శబ్దంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.  ముఖ్యంగా  సిగ్నల్ జంప్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం, పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం వంటి ప్రాణాలను ప్రమాదంలో పడేసే వాటిపై ఫోకస్ చేస్తాయని ప్రకటించారు.  సివిల్ పెట్రోల్స్ 24/7 పనిచేసే పెద్ద రహదారి భద్రతా మిషన్‌లో భాగంగా ఉంటాయన్నారు.  

గతంలో కంటే ఎక్కువ కార్లు రోడ్డుపై ఉన్నందున, డైరెక్టరేట్ అన్ని డ్రైవర్లను ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరింది. జరిమానాల భయంతో మాత్రమే కాకుండా, సమాజం పట్ల శ్రద్ధతో వాహనదారులు జాగ్రత్తగా, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది.

పెట్రోల్స్ వాహనాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఒకప్పుడు ఉల్లంఘనలకు కేంద్రాలుగా ఉన్న అధిక-ప్రమాదకర ప్రాంతాలలో ప్రచారం మంచి ఫలితాలను చూపిస్తుందని పేర్కొన్నారు.  ఈ ప్రచారం కేవలం డ్రైవర్లకు జరిమానాల గురించి మాత్రమే కాదని, ఇదివారికి అవగాహన కల్పించడంతో పాటు వారిలో సరైన మార్పులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. వివిధ ప్రాంతాలలో నిత్యం తిరుగుతూ.. ఈ సివిల్ పెట్రోలింగ్‌లు బహ్రెయిన్ రోడ్లను దశలవారీగా సురక్షితంగా చేస్తున్నాయని అధికారు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com