మహబౌలాలోని రెసిడెన్సీ భవనంలో అగ్నిప్రమాదం.. ఫలించిన చర్యలు..!!
- July 15, 2025
కువైట్: సోమవారం సాయంత్రం మహబౌలా ప్రాంతంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను విజయవంతంగా అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మంగాఫ్, ఫహాహీల్ అగ్నిమాపక కేంద్రాల బృందాలు అత్యవసర పరిస్థితికి వెంటనే స్పందించి మంటలను సమర్థవంతంగా అదుపు చేశాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.
అగ్నిమాపక బృందాలు వెంటనే భవనాన్ని ఖాళీ చేయించి, నివాసితుల ప్రాణాలను కాపాడాయి. మంటలు మరింత వ్యాపించకుండా నిరోధించారు. వారి వేగవంతమైన చర్యల కారణంగా ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.కాగా, అగ్ని ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!