చిరంజీవి ఇంటి విషయంలో GHMCకి హైకోర్టు కీలక ఆదేశాలు
- July 15, 2025
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇంటి విషయంలో జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ మెగాస్టార్ చిరంజీవి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన రిటైన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న దరఖాస్తు చేసుకున్నా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2002లో అనుమతి తీసుకుని జీ+2 ఇంటిని నిర్మించినట్లు తెలిపారు. తరువాత పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది.. చట్టప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!