అబుదాబిలో వాలీబాల్ తో ఆశ్చర్యపరిచిన యూఏఈ ఉపాధ్యక్షుడు..!!
- July 18, 2025
యూఏఈ: అబుదాబిలో నివాసితులతో వాలీబాల్ ఆడి యూఏఈ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీడియోను వామ్ షేర్ చేసింది. కమ్యూనిటీ సభ్యులు, అథ్లెట్లతో కలిసి వాలీబాల్ ఆడటం అందులో కనిపించింది. ఈ సందర్భంగా 'అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్' ఈవెంట్ నిర్వాహకులు వారికి షెడ్యూల్ గురించి వివరించారు. అనంతరం కొన్ని ప్రధాన సౌకర్యాలను సందర్శించారు.
యూఏఈ ప్రస్తుత నాయకత్వం క్రీడల పట్ల బలమైన అనుబంధం కొనసాగుతుంది. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ను నడిపిస్తున్నారు. అలాగే, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్.. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. జియు-జిట్సు ప్రాక్టీస్ చేస్తారు. గల్ఫ్ ప్రాంతంలో మొట్టమొదటి NBA గేమ్‌ను నిర్వహించడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తరచూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోలను Instagramలో షేర్ చేస్తుంటారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







