ఇబ్రహీమి మస్జీదు..ఇజ్రాయెల్ ప్రణాళికను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- July 20, 2025
దోహా: ఇబ్రహీమి మస్జీదు పరిపాలన, పర్యవేక్షణ అధికారాన్ని పాలస్తీనా అవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హెబ్రాన్ మునిసిపాలిటీ నుండి కిర్యాట్ అర్బా సెటిల్మెంట్లోని యూదు మత మండలికి బదిలీ చేయాలనే ఇజ్రాయెల్ ప్రణాళికను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలు, చట్టబద్ధమైన అంతర్జాతీయ తీర్మానాలను స్పష్టంగా ఉల్లంఘించడం అని పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల భావాలను రెచ్చగొట్టడం అని అభివర్ణించింది.
ఇబ్రహీమి మస్జీదు, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని అన్ని పవిత్ర స్థలాల చారిత్రక, చట్టపరమైన స్థితిని మార్చడానికి చేసిన ప్రయత్నాలను ఖతార్ పూర్తిగా తిరస్కరిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనాలోని మతపరమైన పవిత్రతలను కాపాడటానికి, పాలస్తీనా ప్రజల నిజమైన గుర్తింపును తుడిచిపెట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ నేరపూరిత ప్రణాళికలను ఆపేలా అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం