బహ్రెయిన్‌లో కార్లకు డిమాండ్.. 15% పెరిగిన దిగుమతులు..!!
- July 20, 2025
మనామా: 2025 మొదటి ఆరు నెలల్లో బహ్రెయిన్ 22,200 కంటే ఎక్కువ వాహనాలను దిగుమతి చేసుకుంది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 15% పెరుగుదల అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.2024 మొదటి అర్ధభాగంలోదాదాపు 19,400 వాహనాలు దిగుమతి అయ్యాయి.ఈ పెరుగుదలకు స్థానిక మార్కెట్ వృద్ధి, జనాభా పెరుగుదల, కొనసాగుతున్న గృహ విస్తరణ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఆటో రంగంలో పెరిగిన వినియోగదారుల రుణ కార్యకలాపాలు మద్దతు ఇస్తున్నాయని వెల్లడించారు.అత్యధికంగా ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ ద్వారానే వాహనాలు దిగుమతి అవుతున్నాయని తెలిపారు.
స్థానిక డీలర్‌షిప్ డేటా ప్రకారం..బహ్రెయిన్ ఆటో మార్కెట్ సాధారణంగా ప్రతి సంవత్సరం 28,000 నుండి 35,000 కొత్త వాహనాలు సేల్ అవుతాయని స్థానిక డీలర్‌షిప్ డేటా తెలిపింది. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్, జపాన్, దక్షిణ కొరియా నుండి కార్ల దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







