తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- July 20, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలోకి వచ్చే సందర్శకుల ప్రవేశాన్ని మరింత ప్రమాణబద్ధంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కొత్త ఈ-పాస్ విధానంను త్వరలో అమల్లోకి తీసుకురానుంది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా సందర్శకుల వివరాలను ముందుగా నమోదు చేసి,(QR Code) కోడ్ ఆధారిత పాస్ ద్వారా వారికి ప్రవేశం కల్పిస్తారు.ఈ కొత్త విధానం అమలుతో సచివాలయ భద్రతను మరింత బలోపేతం చేయడం, అనవసర సందర్శకుల రాకపోకలను నియంత్రించడం ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ విజిటింగ్ అవర్స్ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ-పాస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
సందర్శకులను లోనికి అనుమతించడానికి, ప్రతి మంత్రి, కార్యదర్శి పేషీకి ఈ పోర్టల్‌కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయిస్తారు. వారి పేషీకి వచ్చే సందర్శకుడి పేరు, చిరునామా, ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయగానే ఆ సందర్శకుడి స్మార్ట్‌ఫోన్ కు ఒక క్యూఆర్ కోడ్ పంపబడుతుంది.సచివాలయం ఎంట్రీ గేట్ వద్ద సందర్శకులు ఈ క్యూఆర్ కోడ్‌ను చూపించాల్సి ఉంటుంది.అక్కడ విధిలో ఉన్న భద్రతా సిబ్బందికి ఈ కోడ్‌ను స్కాన్ చేసేందుకు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించారు.యాప్‌లో కోడ్‌ను స్కాన్ చేయగానే సందర్శకుడి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. వాటిని సరిచూసుకున్న తర్వాతే సందర్శకులను లోనికి అనుమతిస్తారు.
సందర్శకుల వేళలు
ప్రస్తుతం సచివాలయంలో సందర్శకుల వేళలు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్నప్పటికీ, ఉదయం 10 గంటల నుంచే చాలా మంది మంత్రులు, కార్యదర్శుల పేషీల నుంచి ఫోన్ చేసి తమకు సంబంధించిన వ్యక్తులను లోనికి పిలుచుకుంటున్నారు. దీంతో రోజుకు ఎంత మంది సందర్శకులు లోనికి వెళ్తున్నారో, వారి వివరాలు ఏమిటో లెక్కలు ఉండటం లేదు. ఈ కొత్త ఈ-పాస్ విధానం అమల్లోకి రావడంతో, ఏ పేషీ నుంచి విజిటర్‌కు క్యూఆర్ కోడ్ వెళ్లింది, ఒక పేషీ నుంచి రోజుకు ఎంత మందికి పాస్‌లు జారీ అయ్యాయి, సచివాలయంలోకి ప్రతి రోజు ఎంత మంది వస్తున్నారు అనే పూర్తి వివరాలు GAD అధికారుల వద్ద నమోదు అవుతాయి.ఇది భద్రతను పెంపొందించడమే కాకుండా, సందర్శకుల రాకపోకలపై పూర్తి జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది.
తెలంగాణ సచివాలయంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ వ్యవస్థ అంటే ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోకి వచ్చే సందర్శకులను నియంత్రించేందుకు ఈ-పాస్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.ఇది క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ పాస్ సిస్టమ్.
ఈ-పాస్ ఎవరి కోసం?
ఈ-పాస్ వ్యవస్థ విజిటర్లు, అంటే మంత్రి పేషీలకు లేదా కార్యదర్శుల వద్దకు వస్తున్న వ్యక్తుల కోసం. వారు సచివాలయంలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం