ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- July 20, 2025
కువైట్: షార్క్ ఫిష్ మార్కెట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ వినియోగానికి పనికిరాని 10 టన్నుల చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీజ్ చేసిన సీ ఫుడ్ ను నాశనం చేస్తామని జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రకటించింది. బాధ్యులను చట్టపరంగా శిక్షించేందుకు వీలుగా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.
కువైట్ లో ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, ఆహార భద్రతను కాపాడేందుకు అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ ఆపరేషన్ జరిగిందని క్యాపిటల్ గవర్నరేట్ తనిఖీ విభాగం డైరెక్టర్ అలీ అల్-కందారి తెలిపారు. నాలుగు రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను ఆపి తనిఖీలు చేశామని, వాటిలోని మొత్తం వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. “ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ లేదా గడువు ముగిసిన ఆహారాన్ని విక్రయాలు చేస్తే ఎవరినైనా ఫుడ్ అథారిటీ ఉక్కుపాదంతో అణిచివేస్తుంది.” అని అల్-కందారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం