ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!

- July 20, 2025 , by Maagulf
ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!

రియాద్: సౌదీ అరేబియా అమలు చేస్తున్న కొత్త నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్ వ్యవస్థ కార్మిక మార్కెట్ లో మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ప్రపంచంలోని ప్రతిభావంతులను ఆకర్షించడం, ఆర్థిక వైవిధ్యాన్ని పెంచడం అనే విజన్ 2030 లక్ష్యాలకు ఇది వ్యవస్థ నేరుగా తోడ్పాటు అందిస్తుందన్నారు. కొత్త వర్గీకరణ ప్రకారం, ప్రవాస కార్మికులను అర్హతలు, పని అనుభవం, సాంకేతిక సామర్థ్యం, వేతనాలు, వయస్సు వంటి ఆధారంగా మూడు ప్రధాన వర్గాలుగా వర్గీకరించారు. జూన్ 18న ప్రస్తుత కార్మికులకు, జూలై 1 నుండి కొత్తగా వచ్చిన కార్మికులకు అమలులోకి వచ్చింది ఈ వ్యవస్థ.  

ఫ్రాగోమెన్ భాగస్వామి హైదర్ హుస్సేన్ ఈ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. సౌదీ అరేబియా మానవ వనరుల లభ్యతను కొత్త విధానం మెరుగుపరిచిందని, ఇదోక అధునాతన పునర్నిర్మాణంగా అభివర్ణించారు.  ఇలాంటి వ్యవస్థల కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా సౌదీ అరేబియా ప్రపంచ వ్యాపార కేంద్రంగా తన స్థానాన్ని సుస్థితరం చేసుకుంటుందని పేర్కొన్నారు.

 కాగా, ఆగస్టు 3 నుండి రెండవ దశ అమలు కానుంది. దీనిద్వారానే కొత్త విదేశీ నియామకాలను చేపట్టనున్నారు. ఉద్యోగ ఒప్పందాలు, అర్హతలతో సహా అన్ని దరఖాస్తుదారుల డాక్యుమెంటేషన్ కొత్త అవసరాలకు అనుగుణంగా ఉండేలా HR విభాగాలు నిర్ధారించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com