శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- July 20, 2025
రియాద్ : దాదాపు రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న తన కుమారుడు ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ మరణించినట్లు ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ ప్రకటించారు. 2005లో లండన్‌లో జరిగిన ఒక తీవ్రమైన వాహన ప్రమాదంలో అతడు గాయపడి కోమాలోకి వెళ్లారు. తన కుమారుడి అంత్యక్రియల ప్రార్థనలు ఆదివారం రియాద్‌లోని ఇమామ్ తుర్కి బిన్ అబ్దుల్లా మసీదులో అసర్ ప్రార్థన తర్వాత జరుగుతాయని ప్రిన్స్ ఖలీద్ తెలిపారు.
“స్లీపింగ్ ప్రిన్స్” అని గుర్తింపు పొందిన ప్రిన్స్ అల్వలీద్ యూకేలో చదువుకుంటున్న సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి తర్వాత కోమాలోకి వెళ్లాడు. అతను దాదాపు 20 సంవత్సరాలు వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు.
తాజా వార్తలు
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్‌బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్‌గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్‌లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!