సోషల్‌మీడియా సైట్లను ప్రభుత్వం బ్లాక్‌ : టర్కీ

- July 16, 2016 , by Maagulf
సోషల్‌మీడియా సైట్లను ప్రభుత్వం బ్లాక్‌  : టర్కీ

 టర్కీలో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌మీడియా సైట్లను ప్రభుత్వం బ్లాక్‌ చేసినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ను బ్లాక్‌ చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే సోషల్‌మీడియా సేవలను పునురుద్ధరించినట్లు ఓ రీసెర్చ్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే దీనిపై ట్విట్టర్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. సైట్‌ను పూర్తిగా బ్లాక్‌ చేయలేదని తెలిపారు. యూట్యూబ్‌ ప్రతినిధులు స్పందిస్తూ.. కొంతసేపు తమ సేవలు డౌన్‌ అయ్యాయని.. అయితే ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
టర్కీ సైన్యంలోని ఓ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది పోలీసులు సహా 60 మంది మృతిచెందారు. తిరుగుబాటు నేపథ్యంలో 754 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com