కువైట్‌లో పైలట్, డాక్టర్ అరెస్ట్
- July 26, 2025
కువైట్: లైసెన్స్ లేని బుల్లెట్స్, ఆల్కహాల్ కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెపన్స్ ఇన్వెస్టిగేషన్స్ లైసెన్స్ లేని బుల్లెట్లు, ఆల్కహాల్ డ్రింక్స్ ను కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఇద్దరు ఎయిర్‌లైన్ ఉద్యోగులను ( వైద్యుడు, పైలట్) ను అరెస్టు చేసిందని తెలిపింది.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. మొదటి అనుమానితుడు ఒక వైద్యుడు. తన లగేజీలో దాచిపెట్టిన 64 బుల్లెట్లను భద్రతా సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక విచారణలో ఆ బుల్లెట్స్ తనవే అని ఒప్పుకున్నాడు. అయితే, వాటిని సహోద్యోగి (రెండవ అనుమానితుడు, పైలట్) నుండి పొందానని చెప్పాడు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు రెండవ అనుమానితుడైన పైలట్ ను విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి సెర్చ్ వారెంట్ పొందారు. దీనితో పైలట్ నివాసం, వాహనంలో తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేని 500బుల్లెట్లను గుర్తించారు. తదుపరి దర్యాప్తులో అధికారులు అల్-షాబ్ అల్-బహ్రీ ప్రాంతంలోని నిందితుడికి చెందిన మరొక నివాసానికి వెళ్లారు. అక్కడ 87 ఆల్కహాల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను ఉపయోగించి ఇంట్లో మద్యం తయారు చేసినట్లు పైలట్ తెలిపాడు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







