సౌదీ అరేబియాకు A+ క్రెడిట్ రేటింగ్.. ఫిచ్
- July 26, 2025
రియాద్: సౌదీ అరేబియాకు A+ క్రెడిట్ రేటింగ్ ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇచ్చింది. ఇది సౌదీ బలమైన ఆర్థిక స్థితి, నిరంతర సంస్కరణ వేగాన్ని హైలైట్ చేస్తుంది. కీలక ఆర్థిక సూచికల మెరుగైన పనితీరు కారణంగా ఈ స్థిరమైన రేటింగ్ ను అందజేసినట్లు తన తాజా నివేదిలో ఫిచ్ వెల్లడించింది.
ప్రభుత్వ రంగ డిపాజిట్లు, ఇతర ఆస్తుల రూపంలో సౌదీ అరేబియా గణనీయమైన ఆర్థిక నిల్వలను కలిగి ఉందని, దాని స్థూల ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇస్తుందని ఫిచ్ తెలిపింది. భవిష్యత్తులో సౌదీ అరేబియా నికర విదేశీ ఆస్తులు దాని క్రెడిట్ బలానికి మూలస్తంభంగా ఉంటాయని, 2027 నాటికి GDPలో 35.3%కి చేరుకుంటాయని ఏజెన్సీ అంచనా వేసింది.
ఈ సంఖ్య "A" రేటింగ్ పొందిన దేశాల సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది GDPలో కేవలం 3.1% మాత్రమే. చమురు ఆదాయాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా సౌదీ ప్రభుత్వం చేపట్టిన కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలను కూడా ఫిచ్ ప్రస్తావించింది. చమురుయేతర ఆదాయాలలో నిరంతర పెరుగుదలతో పాటు ఈ సంస్కరణలు సౌదీ క్రెడిట్ ప్రొఫైల్ను బలోపేతం చేస్తూనే ఉంటుదని ఫిచ్ తెలిపింది.
తాజా వార్తలు
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!







