పోలీసులుగా నటిస్తూ స్కామర్స్ ఫేక్ వీడియో కాల్స్..హెచ్చరికలు

- July 27, 2025 , by Maagulf
పోలీసులుగా నటిస్తూ స్కామర్స్ ఫేక్ వీడియో కాల్స్..హెచ్చరికలు

మనామా: స్కామర్లు రోజుకో విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా పోలీసు అధికారులుగా నటిస్తూ ఫేక్ వీడియో కాల్స్‌ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.ఈ మేరకు కొత్త రకం స్కామ్ గురించి అధికారులు ప్రజలను హెచ్చరించారు.అవినీతి నిరోధక, ఆర్థిక మరియు ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ప్రకారం.. వీడియో కాల్స్ సమయంలో పోలీసు యూనిఫామ్‌లో కనిపించి, వ్యక్తికి “గడువు ముగిసిన పత్రాలు” ఉన్నాయని లేదా చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలిపారు.ఈ తరహా కేసులకు సంబంధంచి అనేక ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఈ స్కామర్‌లు వ్యక్తిగత వివరాలు లేదా సున్నితమైన బ్యాంక్ సమాచారాన్ని పంచుకోవాలని వ్యక్తులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తారని హెచ్చరించారు.
సురక్షితంగా ఉండేందుకు కొన్ని సూచనలుః
ధృవీకరించని వీడియో కాల్‌ల ద్వారా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు.
యూనిఫాంలు లేదా అధికారికంగా కనిపించే రూపాలతో మోసపోకండి.  
మీకు అనుమానం అనిపిస్తే, వెంటనే ఫోన్ కాల్ చేసి, సంఘటనను సరైన అధికారులకు తెలపాలి.
అత్యవసర సమయంలో, ఫిర్యాదుల కోసం అవినీతి నిరోధక,  ఎలక్ట్రానిక్ భద్రతా హాట్‌లైన్‌ను 992లో సంప్రదించాలి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com